T20 World Cup: గాయంతో హేజిల్‌వుడ్ దూరం.. జట్టులోకి స్టీవ్ స్మిత్ ఎంట్రీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-16 09:19:35  IST  )

T20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టను గాయాల బెడద వేధిస్తోంది. ఈ పేపథ్యంలోనే గాయపడిన పేసర్ హేజిల్‌వుడ్ స్థానంలో స్టీవ్ స్మిత్ తుది జట్టులోకి వచ్చారు.

T20 World Cup: గాయంతో హేజిల్‌వుడ్ దూరం.. జట్టులోకి స్టీవ్ స్మిత్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్-2026 (T20 World Cup-2026)లో భాగంగా మరికొన్ని గంటల్లో శ్రీలంక (Srilanka)తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టులో పెను మార్పు చోటుచేసుకుంది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా, అతడి స్థానంలో బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను జట్టులోకి తీసుకున్నట్లుగా ఐసీసీ టెక్నికల్ కమిటీ ధృవీకరించింది. కొంతకాలంగా కాలి గాయంతో (Achilles injury) బాధపడుతున్న హేజిల్‌వుడ్, ఈ మెగా టోర్నీ నాటికి కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. అయితే, కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉండటంతో వైద్య బృందం సూచన మేరకు అతనిని టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

అయితే, పేసర్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచినా, దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు కెప్టెన్ మిచెల్ మార్ష్ (Michelle Marsh), ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ (Marcus Stoinis) చిన్నపాటి గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు స్మిత్‌ను ఎంపిక చేశారు. మరోవైపు శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తుండటం.. హసరంగ, తీక్షణ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో స్మిత్ అనుభవం జట్టుకు ఎంతో అవసరమని భావించి అతడి వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కూడా అతడి ఎంపికకు కలిసొచ్చింది. జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది

Next Story