టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్.. టాస్ గెలిచిన బ్లాక్ క్యాప్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-04 13:39:31  IST  )

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్.. టాస్ గెలిచిన బ్లాక్ క్యాప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరింది. ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఫస్ట్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా పటిష్టమైన కివీస్‌ను ఢీకొట్టబోతోంది. గత టీ20 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు, ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎప్పుడూ ప్రమాదకరంగా మారే బ్లాక్ క్యాప్స్, దక్షిణాఫ్రికాను కట్టడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే, రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.

సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రామ్ (C), క్వింటన్ డికాక్ (WK), రియాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, కాగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి.

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (C), ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కోల్ మెక్కోంచీ, మాట్ హెన్రీ, లక్కీ ఫెర్గూసన్.

Next Story