టీ20 ప్రపంచకప్-2026 టికెట్ల అమ్మకాలు షురూ.. భారత్, పాక్ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలుసా?

by Harish |

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్-2026 టికెట్ల అమ్మకాలు షురూ..  భారత్, పాక్ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి పొట్టి వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన తొలి దశ టికెట్ల అమ్మకాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి దశలో భాగంగా 20 లక్షల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఐసీసీ తెలిపింది. బుక్ మై షో వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు మరింత అభిమానుల ఆదరణ పొందేందుకు అతి తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

భారత్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌ల టికెట్ల ధర రూ.100తోనే మొదలుకావడం గమనార్హం. ఫిబ్రవరి 9న కోల్‌కతాలో జరిగే బంగ్లా, ఇటలీ మ్యాచ్‌ టికెట్లు రూ.100తోనే ప్రారంభంకానున్నాయి. కొన్ని మ్యాచ్‌లకు రూ.150, రూ.300, రూ.750గా ఉన్నాయి. మరోవైపు, శ్రీలంకలో జరిగే కొన్ని మ్యాచ్‌ల టికెట్ల ధర‌లు ఎల్‌కేఆర్ 1,000(దాదాపు రూ.292) నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 15ను శ్రీలంకలో జరిగే భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ లోయెస్ట్ ప్రైజ్ ఎల్‌కేఆర్ 2,500(దాదాపు రూ.730)గా ఉంది.

సూపర్-8 రౌండ్‌లో కోల్‌కతాలో జరిగే ఓ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల ధర రూ.200తోనే ప్రారంభకానుండటం విశేషం. ‘టీ20 ప్రపంచకప్‌పై మా దృష్టి స్పష్టంగా ఉంది. ప్రతి అభిమాని ఆర్థిక మార్గాలతో సంబంధం లేకుండా స్టేడియంలో ప్రపంచ స్థాయి మార్క్యూ క్రికెట్‌ను అనుభవాన్ని పొందాలి. లక్షలాది మందిని స్టేడియాలకు ఆహ్వానించడానికి రూ.100తోనే టికెట్లు మొదలుకానున్నాయి.’అని ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా వెల్లడించారు. రెండో దశ టికెట్ల అమ్మకాలను త్వరలోనే ప్రారంభిస్తామని ఐసీసీ వెల్లడించింది.


Next Story