T20 ఫైనల్స్... ప్రైజ్ మనీ ఎంతంటే

by velandi.Saikiran |   (  Updated:2026-03-07 18:59:55  IST  )

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య తేడా ఉన్న సంగతి తెలిసిందే.

T20 ఫైనల్స్... ప్రైజ్ మనీ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య తేడా ఉన్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో విజేతగా గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అనే దాని పైన చర్చ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు ఫైనల్ మ్యాచ్ జరగదు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ప్రైజ్ మనీ పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ మొత్తం 120 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచినందుకు 27.48 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక రన్నర్ ఆఫ్ జట్టుకు 14.65 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఐసీసీ. సెమీ ఫైనల్ లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా అలాగే ఇంగ్లాండ్ జట్లకు 7.24 కోట్ల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్దమైంది ఐసీసీ. సూపర్ 8 వరకు వచ్చిన జట్లకు 3.48 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది టోర్నమెంట్ గ్రూప్ లెవెల్ లో వైదొలిగిన జట్లకు 2.29 కోట్ల చొప్పున ఇవ్వడం ఉంది ఐసీసీ. ఇవి ఇలా ఉండగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ రేపు జరగనుంది. ఇందులో గెలిచినట్టు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది.

Next Story