- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. ఆ ప్లేయర్ అన్ సోల్డ్ !
కోహ్లీతో పాటు కనిపించడంతో స్వస్తిక్ చికారా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 మినీ వేలం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అబుదాబి వేదికగా జరిగిన ఈ ఈవెంట్ లో చాలామంది ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. అయితే మరికొంతమంది ప్లేయర్లకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బే తగిలింది. చాలామంది ప్లేయర్లు అన్ సోల్డ్ అయ్యారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ జట్టుకు చెందిన స్వస్తిక్ చికారా కూడా ఉన్నాడు. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ లో బెంగళూరు గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు స్వస్తిక్ చికారా అనే ఆటగాడు సందడి చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీతో పాటు కనిపించడంతో స్వస్తిక్ చికారా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్ సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే, ఈ స్వస్తిక్ చికారాకు నిన్న జరిగిన వేలంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అతన్ని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో మినీ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు స్వస్తిక్ చికారా.






