- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ మ్యాచ్‌కు అభిషేక్ దూరం? సూర్య ఏం చెప్పాడంటే?
పాక్ మ్యాచ్‌కు అభిషేక్ దూరం? నమీబియాతో మ్యాచ్ సమయంలో సూర్యకుమార్ ఏమన్నాడంటే?

దిశ, స్పోర్ట్స్: అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమైన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. భారత్ ఆడే తదుపరి మ్యాచ్‌కు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ముంబైలో యూఎస్ఏతో మ్యాచ్ ఆడిన అభిషేక్.. కడుపులో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిపాలయ్యాడు. రెండ్రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత బుధవారమే డిశ్చార్జ్ అయ్యాడు. అమెరికాతో మ్యాచులో కూడా అతను అనారోగ్యంతోనే ఉన్నట్లు సమాచారం. ముంబైలో నెట్ ప్రాక్టీస్ సమయంలో బాగా డీహైడ్రేట్ అయిపోయిన అభిషేక్.. బాగా బరువు కోల్పోయాడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.
తిన్న ఆహారం పడకపోవడం వల్లనే అతనికి కడుపులో ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది. అనారోగ్యం వచ్చినా యూఎస్‌ఏతో మ్యాచ్ ఆడిన అభిషేక్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్‌లో కూడా ఉండలేపోయిన అతను.. పోస్ట్ మ్యాచ్ హ్యాండ్ షేక్‌కి కూడా రాలేదు. ప్రస్తుతం కోలుకున్నప్పటికీ.. ఒకటి, రెండు మ్యాచులకు అభిషేక్ దూరమవుతాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. దీంతో పాక్‌తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌లో అభిషేక్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.






