- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2026 T20 World Cup: పాకిస్తాన్ పరువు తీసిన సూర్య..ఫైనల్ మ్యాచ్ మోడీ స్టేడియంలోనే !
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే తలపడతాయని సూర్యకుమార్ యాదవ్

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే తలపడతాయని సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆస్ట్రేలియాను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8, 2026 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోడీ స్టేడియంలో జరగనుంది.
ఒకవేళ పాకిస్తాన్ క్వాలిఫై అయితే, కొలంబో వేదికగా మార్చి 8న ఫైనల్ ఉంటుంది. అయితే ఇదే విషయంపై సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఫైనల్స్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఫైనల్ కు వచ్చే ఛాన్స్ ఏ లేదని బాంబు పేలిచారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తమను ఓడించింది, కానీ ఈసారి మేము ఆస్ట్రేలియా ఫైనల్స్ లో ఓడిస్తామని శపథం చేశారు.






