- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కదా సక్సెస్ అంటే..బెడ్ రూంలో ఒక వైపు ట్రోఫీ, మరోవైపు భార్య !
2026 T20 ప్రపంచ కప్ విజయం తర్వాత తన భార్య దేవిషా శెట్టితో ఆనందాన్ని పంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటు సూర్య కుమార్ యాదవ్ సేన కూడా టైటిల్ గెలిచిన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తోంది. ఆదివారం న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి, 140 కోట్ల మంది ఇండియన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది భారత జట్టు. అయితే ఈ సందర్భంగా భారత సారథి సూర్య కుమార్ యాదవ్ టైటిల్ గెలిచిన ఆనందాన్ని తన భార్యతో పంచుకున్నాడు. 2024 సమయంలో ఒక ప్లేయర్ గా ఇండియాకు టైటిల్ తీసుకువచ్చిన సూర్య కుమార్ యాదవ్, ఈ 2026 లో సారధిగా బరిలోకి దిగి, భారత జట్టు కల నెరవేర్చాడు.
భార్యతో సంబరాలు చేసుకున్న కెప్టెన్ సూర్య
ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి టైటిల్ తో పాటే నిద్రించింది సూర్య కుమార్ యాదవ్ ఫ్యామిలీ. భారత కెప్టెన్ సూర్య, తన భార్య దేవిషా శెట్టి ఇద్దరు కూడా టైటిల్ ను మధ్యలో పెట్టి, బెడ్ రూంలో నిద్రించారు. 2024 సమయంలో కూడా సూర్య కుమార్ యాదవ్, దేవిషా శెట్టి ( Devisha Shetty) ఇదే ఫోజ్ ఇచ్చారు. దీంతో ఈ అన్యోన్యమైన జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన భారత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఏజ్ బారైన తర్వాత జట్టులోకి వచ్చి, కెప్టెన్ కావడమే కాకుండా.. ఐసీసీ ట్రోఫీని కూడా భారత జట్టుకు అందించడం గ్రేట్ అంటూ సూర్యకుమార్ యాదవ్ ను ( Surya kmar yadav) మెచ్చుకుంటున్నారు. ఇదే కదా సక్సెస్ అంటూ మరికొంతమంది సూర్యను పొగుడుతున్నారు. ఇదే ఊపుతో భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని సూర్య కుమార్ యాదవ్ కు సూచనలు చేస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా కెప్టెన్ గా సక్సెస్ అవుతోన్న సూర్య భాయ్.. బ్యాటింగ్ లో మాత్రం వరుసగా విఫలం అవుతోన్న సంగతి ఎలిసిందే.






