- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్-2026లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్.. దాయాదీ జట్టును సాధారణ ప్రత్యర్థిగానే చూస్తోంది. పాక్‌తో ఆడమా.. గెలిచామా అన్న ధోరణితోనే మైదానంలోకి దిగుతుంది. తాజా మ్యాచ్‌లోనూ పాక్ ఛేదనకు దిగే ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇదే విషయాన్ని జట్టు సభ్యులకు తెలియజేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాక్ బ్యాటర్లను స్లెడ్జ్ చేయొద్దని సహచర ప్లేయర్లను కోరాడు. మన నైపుణ్యాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలని, మైదానంలో మాటల యుద్ధానికి దిగొద్దని చెప్పాడు. తమ ప్రదర్శనతో మాత్రమే బదులివ్వాలని తెలిపాడు. ‘ఎవరినీ ఏం అనొద్దు. మనం మంచి క్రికెట్ ఆడాలి. మంచి నైపుణ్యాల ద్వారా మనం ఈ మ్యాచ్‌ను గెలవాలి.’అని సూర్య చెప్పుకొచ్చాడు. భారత్ 176 పరుగుల లక్ష్యం పెట్టగా.. పాక్ 114 రన్స్‌కే ఆలౌటైంది. ఇషాన్ కిషన్(77) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.






