విరాట్ కోహ్లీకి భారతరత్న..!

by velandi.Saikiran |

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ( Virat Kohli) భారతరత్న (Bharata ratna) ఇవ్వాలని.. మాజీ క్రికెటర్ సురేష్ రైనా

విరాట్ కోహ్లీకి భారతరత్న..!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ( Virat Kohli) భారతరత్న (Bharata ratna) ఇవ్వాలని.. మాజీ క్రికెటర్ సురేష్ రైనా ( Suresh raina) డిమాండ్ చేశారు. అప్పుడే టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు ప్రతిఫలం దక్కుతుందని పేర్కొన్నాడు. టీమిండియా జట్టుకు విరాట్ కోహ్లీ ఎంతో సేవలు చేశారని... గుర్తు చేశారు సురేష్ రైనా. అందుకే కేంద్రం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని... భారతరత్న అవార్డుతో కోహ్లీని సత్కరించాలని కోరారు.

ఇది ఇలా ఉండగా విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడాడు విరాట్ కోహ్లీ. ఈ సుదీర్ఘ కాలంలో.. టీమిండియా జట్టు కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా ఎన్నో విజయాలను కూడా అందించాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియా జట్టు బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టోర్నమెంటును అందించడంలో విఫలమయ్యాడు కోహ్లీ. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

Next Story