- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాల్లోకి మరో స్టార్ క్రికెటర్..!
టీమిండియా క్రికెటర్లు... చాలా రకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. క్రికెట్ ఆడుతూనే... రకరకాల బ్రాండ్లకు... బ్రాండ్ అంబాసిడ

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా క్రికెటర్లు... చాలా రకాల బిజినెస్ లు చేస్తూ ఉంటారు. క్రికెట్ ఆడుతూనే... రకరకాల బ్రాండ్లకు... బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. అలా చాలా మంది క్రికెటర్లు డబ్బులు సంపాదిస్తున్నారు. మరికొంతమంది హోటల్లు, రెస్టారెంట్, ఇతర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి సంపాదిస్తున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ ( MSD) లాంటి వారు సినిమా రంగం వైపు కూడా అడుగులు వేసిన సంగతి తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో మరో స్టార్ క్రికెటర్ సినిమాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన ఎవరో కాదు మిస్టర్ ఐపిఎల్ సురేష్ రైనా ( Suresh Raina). అతి త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సురేష్ రైనా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా కథనాలు ప్రచురణ అయ్యాయి. ఓ తమిళ సినిమాలో... సురేష్ రైనా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున... దక్షిణాది రాష్ట్రాలలో సురేష్ రైనా బాగా పాపులర్ అయ్యారు. అందుకే... సౌత్ ఇండియా నుంచి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ లాంటి వాళ్లు పలు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. వాళ్ల తరహాలోనే సినిమాలు చేయాలని సురేష్ రైనా అనుకుంటున్నారట. ఒకవేళ సినిమా మంచిగా హిట్ అయితే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సురేష్ రైనా ఇప్పటికే టీమ్ ఇండియా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.






