IPL 2026లోనూ MS ధోని.. హింట్ ఇచ్చిన స్టార్ ప్లేయర్

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో.... చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు అదిరిపోయే శుభవార్త

IPL 2026లోనూ MS ధోని.. హింట్ ఇచ్చిన స్టార్ ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో.... చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) ఆడడంపై.... మాజీ క్రికెటర్ సురేష్ రైనా ( Suresh Raina) కీలక ప్రకటన చేశారు. 2026 టోర్నమెంట్ లో కూడా మహేంద్రసింగ్ ధోని... ఆడతాడని సురేష్ రైనా వెల్లడించారు.

వచ్చే సీజన్ లో కూడా ధోని కి ఆడే శక్తి ఉందని... కచ్చితంగా ఆడతాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్.. సరిగ్గా ఆడలేదని కూడా గుర్తు చేశారు. కాబట్టి వచ్చే సంవత్సరం మొదటి నుంచి చెన్నై కెప్టెన్ గా ధోని కొనసాగుతాడని కూడా సురేష్ రైనా చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా... ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) అత్యంత దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. పాయింట్లు పట్టికలో పదవ స్థానంలో నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు, 9 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఏడింటిలో ఓడిపోయింది. తాజాగా హైదరాబాద్ ( SRH) చేతిలో కూడా దారుణ ఓటమి చవిచూసి ప్లే ఆఫ్ చాన్సులు కూడా వదిలేసుకుంది.

Next Story