టీం ఇండియా ఆటగాళ్లకు సునీల్ గవాస్కర్ కీలక సూచన

by Sathputhe Rajesh |

భారత ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌లో కూర్చొవద్దని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.

టీం ఇండియా ఆటగాళ్లకు సునీల్ గవాస్కర్ కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : భారత ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌లో కూర్చొవద్దని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అడిలైడ్‌లో ఆదివారం జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యచ్‌లో ఓటమి అనంతరం ఆయన మాట్లాడారు. ‘అడిలైడ్ టెస్ట్ రెండు రోజులు మిగిలి ఉండగానే అయిపోయింది. ఈ రెండు రోజులను ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలి. ఆటగాళ్లు తమ నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ‘ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్‌’ సరికాదు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఆటగాళ్లు కమిట్‌మెంట్‌తో మెదలాలి. ప్రస్తుత సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గానే భావించాలి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లా భావించవద్దు. ఆస్ట్రేలియాకు క్రికెట్ ఆడేందుకు ప్లేయర్లు వచ్చారు హోటల్ రూమ్స్‌లో కూర్చొవడానికి కాదు. బ్యాట్స్‌మెన్లు ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేదు. బౌలర్లు రిథమ్ అందుకోలేదు. బుమ్రా, రోహిత్, విరాట్ ప్రాక్టీస్ చేయకున్నా పర్వాలేదు. వారికి అనుభవం ఉంది. మిగతా వాళ్లంతా తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే..’ అని గవాస్కర్ అన్నాడు.

Next Story