- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుమిత్ శుభారంభం.. రెండో రౌండ్‌కు క్వాలిఫై
by Harish |
మరాకెచ్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు.

X
దిశ, స్పోర్ట్స్ : మొరాకోలో జరుగుతున్న మరాకెచ్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ శుభారంభం చేశాడు. టోర్నీలో రెండో రౌండ్‌కు దూసెకెళ్లాడు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమిత్ 4-6, 6-3, 6-2 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు కొరెంటిన్ మౌటెట్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్ కోల్పోయి వెనుకబడిన సుమిత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని మిగతా రెండు సెట్లను దక్కించుకున్నాడు. బుధవారం రెండో రౌండ్‌లో ఇటలీ ప్లేయర్ లోరెంజో సొనెగోతో తలపడనున్నాడు.
- Tags
- #Sumit Nagal
Next Story






