క్వాలిఫయింగ్‌లో రెండో రౌండ్‌కు సుమిత్

by Dishanational3 |
క్వాలిఫయింగ్‌లో రెండో రౌండ్‌కు సుమిత్
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్‌ వేదికగా జరుగుతున్న మోంటె కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్ మెయిన్ డ్రా బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచాడు. మెన్స్ సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో శుభారంభం చేసిన అతను రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ 6-2, 6-3 తేడాతో 8వ సీడ్, ఇటలీకి చెందిన ఫ్లావియో కోబోలి‌పై సునాయాస విజయం సాధించాడు. గంటా 21 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి సుమిత్ వరుసగా రెండు సెట్లను నెగ్గాడు. ఇటలీ ఆటగాడు 11 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్ మూడు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో సుమిత్ క్వాలిఫయింగ్‌లో రెండో రౌండ్‌కు చేరడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఆదివారం జరిగే రెండో రౌండ్‌లో అర్జెంటీనా ప్లేయర్ డియాజ్ అకోస్టాతో ఆడనున్నాడు.

Next Story

Most Viewed