విద్యార్థినులకు రక్షణ ఏది...?

by velandi.Saikiran |   (  Updated:2025-08-04 02:28:17  IST  )

వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో రాత్రి వేళలో విద్యార్థినులకు రక్షణ కరువైంది. హౌస్

విద్యార్థినులకు రక్షణ ఏది...?
X

విద్యార్థినులకు రక్షణ ఏది...?

వైరా బాలికల గురుకులంలో

అందుబాటులో ఉండని హౌస్ మేడమ్స్

రాత్రి వేళల్లో ఒకే ఉపాధ్యాయురాలు విధులు

స్థానికంగా ఉండని ఉపాధ్యాయినులు

ఖమ్మం టు వైరా నిత్యం డైలీ సర్వీస్

సమయపాలన పాటించని వైనం

వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో రాత్రి వేళలో విద్యార్థినులకు రక్షణ కరువైంది. హౌస్ మేడమ్స్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందుబాటులో ఇక్కడ ఎవరూ ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. 650మంది విద్యార్థినులు చదువుతున్నా.. నిత్యం రాత్రి వేళల్లో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విద్యార్థినులతో కలిసి బస చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న 31మంది ఉపాధ్యాయురాళ్లలో చాలా మంది ఖమ్మం నుంచి వైరాకు నిత్యం డైలీ సర్వీస్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ సైతం స్థానికంగా నివాసం ఉండకుండా ఖమ్మం నుంచి వస్తున్నట్లు తెలుస్తున్నది. రాత్రివేళల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే దిక్కుగా ఉన్న పరిస్థితి నెలకొన్నది. అంతేకాకుండా కొంత ఉపాధ్యాయురాళ్లు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. - దిశ, వైరా

దిశ, వైరా : వైరాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో విద్యార్థినులకు కనీస రక్షణ కరువైంది. రాత్రి వేళలో విద్యార్థినులకు హౌస్ మేడమ్స్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిత్యం రాత్రి వేళల్లో ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే విద్యార్థినులతో కలిసి బస చేస్తున్నారని తెలుస్తోంది. క్వార్టర్స్ లేవనే సాకుతో ఉపాధ్యాయురాళ్లు, అధ్యాపకురాళ్లు స్థానికంగా నివాసం ఉండటం లేదు. ఈ పాఠశాల, కళాశాలలో సుమారు 31మంది ఉపాధ్యాయినులు, అధ్యాపకురాళ్లు పనిచేస్తున్నారు. ఇక్కడ సుమారు 650 మంది విద్యార్థినులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఉపాధ్యాయురాళ్లు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 31మంది ఉపాధ్యాయురాళ్లలో 99శాతం మంది ఖమ్మం నుంచి వైరా నిత్యం డైలీ సర్వీస్ చేస్తున్నారు. వైరాకు సుమారు 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఖమ్మం నుంచి ఉపాధ్యాయురాళ్లు డైలీ సర్వీస్ చేస్తున్న కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. స్వయానా ప్రిన్సిపాల్ కూడా స్థానికంగా నివాసం ఉండకుండా ఖమ్మం నుంచి నిత్యం డైలీ సర్వీస్ చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాత్రివేళల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన హౌస్ మేడమ్స్, ప్రిన్సిపాల్ ఖమ్మంలో నివాసముంటున్న పట్టించుకునే వారే కరువయ్యారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయురాళ్లు సమయపాలన పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉదయం 8గంటలకు పాఠశాల ప్రారంభ సమయానికి ఉపాధ్యాయురాళ్లు పాఠశాలకు హాజరు కావడం లేదు. ఇప్పటికే ఈ పాఠశాల కళాశాల నిర్వహణపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పేరెంట్స్ కమిటీ ఈ పాఠశాల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలపై అనేకసార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఈ పాఠశాల నిర్వహణ పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ పాఠశాల నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కనీసం కరువైంది. రాత్రివేళల్లో విద్యార్థినీలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినప్పటికీ విధుల్లో ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే దిక్కుగా ఉంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఎక్కడ ఉన్నా సమయానికొస్తే చాలు

ప్రిన్సిపాల్ సమత

పాఠశాలలో క్వార్టర్ లేనందున స్థానికంగా ఉపాధ్యాయురాళ్లు నివాసం ఉండటం లేదు. వారు ఎక్కడ నివాసం ఉన్నప్పటికీ తనకు సమయానికి పాఠశాలకు వస్తే సరిపోతుంది. 15కిలోమీటర్ల లోపు దూరంలో తాము నివాసం ఉండేందుకు అర్హత ఉంది. మరీ ఖమ్మం నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉందని ప్రశ్నించగా ఉపాధ్యాయురాళ్లు ఎక్కడి నుంచి వచ్చిన సమయానికే పాఠశాలకు హాజరవుతున్నారు.

Next Story