- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
27 పరుగులకే విండీస్ ఆలౌట్..టెస్టు క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు!
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

దిశ, స్పోర్ట్స్: టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోరుకు వెస్టిండీస్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ జట్టు కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఏకంగా 176 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సిరీసును 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. ఫ్రాంక్ వారెల్ ట్రోఫీని రిటైర్ చేసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత కేవలం 121 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది.
దీంతో విండీస్ ముందు 204 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ ఛేదనలో ఆసీస్ బౌలర్లు స్టార్క్, బోలాండ్ నిప్పులు చెరిగారు. స్టార్క్ కేవలం 9 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ ఛేజ్ తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా జాన్ కాంప్‌బెల్ (0), కెల్విన్ ఆండర్సన్ (0), బ్రాండన్ కింగ్(0)లను స్టార్క్ అవుట్ చేశాడు. ఇక 14వ ఓవర్లో వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్ (11), షమర్ జోసెఫ్ (0), జాబెల్ వారికన్ (0)లను అవుట్ చేసిన స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్‌తో మెరిశాడు.
గ్రీవ్స్ మినహా మిగతా విండీస్ బ్యాటర్లెవరూ కనీసం 5 పరుగులు కూడా చేయలేదు. దీంతో ఆ జట్టు కేవలం 27 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్సులో 6 ఎక్స్‌ట్రాలు కూడా ఉండటంతో.. అదృష్టం బాగుండి న్యూజిల్యాండ్ పేరిట ఉన్న 26 పరుగుల అత్యల్ప టెస్టు స్కోరు రికార్డును అధిగమించింది.






