స్టార్ స్పోర్ట్స్ ‘బిలీవ్ అంబాసిడర్’గా రిషబ్ పంత్‌..!

by Disha Web Desk 13 |
స్టార్ స్పోర్ట్స్ ‘బిలీవ్ అంబాసిడర్’గా రిషబ్ పంత్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు బంపరాఫర్ లభించింది. దేశంలో క్రికెట్ పాపులారిటీని పెంచేందుకు స్టార్ స్పోర్ట్స్ కొత్త క్యాంపెయిన్లు చేపట్టాలని చూస్తోంది. దీని కోసం ప్రముఖ క్రికెటర్లతో 'బిలీవ్ అంబాసిడర్లు'గా ఒప్పందం చేసుకుంటోంది. గతేడాది స్టార్ స్పోర్ట్స్ వద్ద కేవలం ఇద్దరు బిలీవ్ అంబాసిడర్లే ఉండగా.. ఆ సంఖ్యను 6 కు పెంచింది. వీరిలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఈ బృందంలోకి రిషభ్ పంత్‌ కూడా వస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని స్టార్స్ స్పోర్ట్స్ ప్రతినిధులు చెప్పారు. పంత్ కూడా ఈ సంస్థతో కలిసి పనిచేయడం వల్ల క్రికెట్ పాపులారిటీ పెంచే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. 'స్టార్ స్పోర్ట్స్ బిలీవ్ అంబాసిడర్‌గా ఈ సంస్థతో కలిసి పని చేస్తానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా' అని పంత్ తెలిపాడు.



Next Story

Most Viewed