- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh raina) ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh raina) ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానంలో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా, ఇప్పుడు తన తొలి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. క్రికెట్ నేపథ్యంలో రానున్న తమిళ చిత్రంతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి లోగన్ దర్శకత్వం వహిస్తుండగా.. డ్రీమ్ నైట్ స్టోరీస్ నిర్మాణ సంస్థ కింద శ్రవణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రైనాకు ఇది పరిచయమైన అంశమైనందున, ఆయన పాత్రలో నిజమైన అనుభవం కనిపించనుందన్న అంచనాలు మొదలయ్యాయి. కాగా, ఇప్పటికే పలువురు క్రికెటర్లు సినిమా రంగంలో తమ ప్రతిభ చాటుకున్న సంగతి తెలిసిందే. 2022లో విక్రమ్ హీరోగా వచ్చిన చిత్రం కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్.. ఇంటర్ పోల్ అధికారి పాత్రలో కనిపించాడు. ఫ్రెండ్‌షిప్ చిత్రంలో కన్నడ నటుడు అర్జున్‌తో కలిసి హర్భజన్ సింగ్ అలరించిన సంగతి తెలిసిందే. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఇప్పటికే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ (MS Dhoni) తన నిర్మాణ సంస్థ (Dhoni Entertainment) కింద 'లెట్స్ గెట్ మ్యారీడ్' మూవీని రూపొందించారు.






