బాబ‌ర్ మ‌రోసారి డ‌కౌట్‌..లంక చేతిలో పాకిస్తాన్ ఘోర ఓట‌మి

by velandi.Saikiran |   (  Updated:2025-11-27 20:31:07  IST  )

పాకిస్తాన్ ( Pakistan ) గడ్డపై జరుగుతున్న టి20 ట్రై సిరీస్ 2025 ( T20I Tri-Series 2025) టోర్నమెంటులో

బాబ‌ర్ మ‌రోసారి డ‌కౌట్‌..లంక చేతిలో పాకిస్తాన్ ఘోర ఓట‌మి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్ ( Pakistan ) గడ్డపై జరుగుతున్న టి20 ట్రై సిరీస్ 2025 ( T20I Tri-Series 2025) టోర్నమెంటులో శ్రీలంక మరో అద్భుతమైన విజయం సాధించింది. ఆతిథ్య‌ పాకిస్తాన్ జట్టును మట్టి కల్పించిన శ్రీలంక, ఏకంగా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం రోజున ఈ ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్ణీత 20 ఓవర్లు ఆడిన శ్రీలంక జట్టు 5 వికెట్లు నష్టపోయి 184 పరుగులు సాధించింది.

శ్రీలంక బ్యాటర్లలో కమిల్ మిశ్రా ( Kamil Mishara) 48 బంతుల్లో 76 పరుగులతో దుమ్ము లేపాడు. ఆ తర్వాత కుశల్ మెండీస్ 43 పరుగులతో రాణించాడు. చివరలో జనిత్ ( Janith Liyanage) 24 పరుగులతో రఫ్పాడించాడు. దీంతో 185 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ముందు ఉంచింది శ్రీలంక. ఇక ఛేజింగ్ చేసే క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్లు, ఎవరు కూడా పెద్దగా రాణించలేదు. ఓపెనర్లు ఇద్దరూ తొందరగానే వికెట్ సమర్పించుకున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి చెత్త ప్రదర్శన కనబరిచాడు.

ఈ మ్యాచ్ లో రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు బాబ‌ర్‌. ఇక పాకిస్తాన్ టి20 కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కడే 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడు ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు ఎవరు సపోర్ట్ చేయలేదు. దీంతో చివరికి ఆరు పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఫైనల్ కు శ్రీలంకతో పాటు పాకిస్తాన్ క్వాలిఫై అయ్యాయి. శుక్రవారం అంటే నవంబర్ 29వ తేదీన ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన టీమ్ ట్రై సిరీస్ సొంతం చేసుకోనుంది.

Next Story