ఏంజెలో చివరి టెస్టులో శ్రీలంక తడబాటు.. ముష్ఫికర్, షాంటో సెంచరీలు

by Phanindra |

ఏంజెలో మాథ్యూస్ చివరి టెస్టులో శ్రీలంక తడబడుతోంది. బంగ్లాదేశ్ స్టార్లు షాంటో, ముష్ఫికర్ సెంచరీలతో చెలరేగారు.

ఏంజెలో చివరి టెస్టులో శ్రీలంక తడబాటు.. ముష్ఫికర్, షాంటో సెంచరీలు
X

దిశ, స్పోర్ట్స్: శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ఒకానొక దశలో 45/3తో కష్టాల్లో ఉన్న ఆ జట్టును కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో (136 నాటౌట్), వెటరన్ ముష్ఫికర్ రహీం (105 నాటౌట్) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 292/3 స్కోరుతో పటిష్టమైన స్థితిలో నిలిచింది. శ్రీలంక బౌలర్లలో రత్ననాయకే రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా, అసిత ఫెర్నాండో ఒక వికెట్ తీసుకున్నాడు.

మాథ్యూస్‌కు చివరి టెస్టు..

శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌కు ఇదే చివరి టెస్టు. ఈ మ్యాచుతో తను సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు కొన్నిరోజుల క్రితమే మాథ్యూస్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే తన కెరీర్లో 119వ టెస్టు ఆడుతున్న అతనికి కొందరు ప్లేయర్లు బ్యాట్లతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ స్వాగతం అందించారు.

Next Story