- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవడంపై శ్రీలంక బోర్డు క్లారిటీ
సిబ్బందికి ఫుల్ సెక్యూరిటీ ఇస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ లో బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో 8 మంది శ్రీలంక ప్లేయర్లు, పాకిస్తాన్ ను వదిలి వెళ్ళిపోతామని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందిగ్ధతపై తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఎప్పటిలాగానే శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుందని వెల్లడించింది.
తమ ప్లేయర్లు, సిబ్బందికి ఫుల్ సెక్యూరిటీ ఇస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ 8 మంది శ్రీలంక ప్లేయర్లు పాకిస్తాన్ వదిలేసి తమ దేశానికి వస్తే, ప్లాన్ బీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఆ 8 మంది స్థానంలో కొత్త ప్లేయర్లను శ్రీలంక నుంచి పాకిస్తాన్ కు పంపిస్తామని బోర్డు ప్రకటన విడుదల చేసింది. దీంతో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ రెండో వన్డే యథావిధిగా జరగనుంది.






