- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్ 2026 కోసం శ్రీలంక సంచలన నిర్ణయం
by velandi.Saikiran |
శ్రీలంక జట్టు కెప్టెన్ గా దాసున్ షనక ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ (SLC) చీఫ్ సెలెక్టర్ ప్రమోద్య

X
దిశ, వెబ్ డెస్క్: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక రెండు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అంటే ఐపీఎల్ కంటే ముందే ఈ మెగా టోర్నమెంట్ ఫినిష్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో శ్రీలంక జట్టు కెప్టెన్ గా దాసున్ షనక ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ (SLC) చీఫ్ సెలెక్టర్ ప్రమోద్య విక్రమసింఘే ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చరిత్ అసలంక స్థానంలో శ్రీలంక T20I కెప్టెన్‌గా దాసున్ షనకను కొనసాగించనున్నారట. కాగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి.
Next Story






