ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న కమిన్స్.. ఆ మ్యాచ్‌తో ఎంట్రీ?

by Harish |

ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్.. పూర్తిగా కోలుకున్న కమిన్స్.. ఆ మ్యాచ్‌తో ఎంట్రీ?
X

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ గుడ్ న్యూస్. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్-2026కు అందుబాటులోకి రానున్నాడు. గతేడాది జూలై నుంచి అతను వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ కారణంగానే ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చినా మైదానంలో మాత్రం దిగలేదు. తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ ఎస్‌ఆర్‌హెచ్‌ను నడిపిస్తున్నాడు. అయితే, ఇటీవల స్కానింగ్ కోసం కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం సిడ్నీలో నిర్వహించిన స్కానింగ్‌లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. గాయం పూర్తిగా మానినట్టు నిర్ధారణ అయ్యింది. అలాగే, పూర్తిగా ఫిట్‌నెస్ దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి అనుమతి ఇచ్చింది. దీంతో శుక్రవారం కమిన్స్ ఇండియాకు రానున్నట్టు తెలుస్తోంది. అయితే, అతను వెంటనే మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు లేవని సమాచారం. మరో రెండు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉంటాడని తెలుస్తోంది. సన్‌రైజర్స్ జట్టు.. ఈ నెల 18న చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో, 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఈ రెండు గేములకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని సమాచారం. దీనిపై సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Next Story