- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH: సన్ రైజర్స్ నుంచి క్లాసెన్ ఔట్ ?
హెన్రిచ్ క్లాసెన్ పెద్దగా రాణించలేదు. దీంతో అతన్ని వదిలేసి, డబ్బులు మిగుల్చుకోవాలని అనుకుంటోందట హైదరాబాద్ జట్టు

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (IPL 2026) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు (SRH) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన డేంజర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ను (Heinrich Klaasen) వదిలేసేందుకు కావ్య మారన్ ( Kavya Maran) సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 15వ తేదీన మినీ వేలం ఉన్న నేపథ్యంలో అతన్ని వదిలేయాలని కావ్య పాప డిసైడ్ అయ్యారట.
గత సీజన్ లో హెన్రిచ్ క్లాసెన్ పెద్దగా రాణించలేదు. దీంతో అతన్ని వదిలేసి, డబ్బులు మిగుల్చుకోవాలని అనుకుంటోందట హైదరాబాద్ జట్టు యాజమాన్యం. హెన్రిచ్ క్లాసెన్ ను వదిలేస్తే, మిగిలే డబ్బులతో ఓ వికెట్ కీపర్ తో పాటు, మంచి బౌలర్ ను తీసుకోవాలని కావ్య పాప ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే, హెన్రిచ్ క్లాసెన్ వేలంలోకి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయాలని స్కెచ్ వేస్తోందట.






