- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్ఆర్ పై సూపర్ విక్టరీ.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సంచలన నిర్ణయం
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! బ్యాటింగ్, కెప్టెన్సీపై ఫోకస్ పెట్టేందుకు వికెట్ కీపింగ్‌కు దూరం.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జట్టు తాత్కాలిక సారథి ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను జట్టులో వికెట్ కీపింగ్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల భారీ విజయం తర్వాత ఇషాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో జట్టును నడిపిస్తున్న ఇషాన్, కేవలం బ్యాటింగ్, కెప్టెన్సీపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ పై విజయం తర్వతే ఈ నిర్ణయం..
వికెట్ కీపింగ్ (Keeping) చేస్తూ ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలర్లతో నిరంతరం సంభాషించడం కొంత ఇబ్బందిగా మారుతోందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు. "కీపింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ల దగ్గరకు వెళ్లి ప్రణాళికల గురించి చర్చించడానికి తగిన సమయం దొరకడం లేదు. మైదానంలో బౌలర్లకు అందుబాటులో ఉండి, ఎప్పటికప్పుడు ఫీల్డ్ మార్పులు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నాను" అని ఇషాన్ పేర్కొన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై 91 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్, తన వ్యూహాలతో యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌లను అద్భుతంగా గైడ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే కీపింగ్ బాధ్యతలను వేరే ప్లేయర్‌కు అప్పగించి, తను మాత్రం ఫీల్డ్ లో ఉండి జట్టును నడిపించాలని నిర్ణయించుకున్నట్లు ఇషాన్ కిషన్ ప్రకటించారు.






