- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశాంత్‌పై మూడేళ్లు సస్పెన్షన్ వేటు
భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) మూడేళ్లపాటు సస్పెన్షన్ విధించింది.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ ఎస్.శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) మూడేళ్లపాటు సస్పెన్షన్ విధించింది. సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసోసియేషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేసింది. గత నెల 30న జరిగిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్‌లో శ్రీశాంత్‌పై కేసీఏ చర్యలు తీసుకోగా.. తాజాగా బయటకొచ్చింది.
అసలేం జరిగిందంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. శాంసన్‌కు స్థానం దక్కకపోవడానికి కేసీఏనే కారణమని శ్రీశాంత్ ఆరోపణలు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుంచి శాంసన్‌ను తప్పించడం అతన్ని ఎంపిక చేయకపోవడానికి కారణమైందన్నాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కేసీఏ అతనికి నోటీసు పంపింది. అయితే, శ్రీశాంత్ ఇచ్చిన సమాధానంతో రాష్ట్ర అసోసియేషన్ సంతృప్తి చెందకపోవడంతో అతనిపై చర్యలు తీసుకుంది.
శాంసన్‌కు మద్దతుగా నిలిచినందుకు చర్యలు తీసుకోలేదని, అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఏ స్పష్టం చేసింది. కేరళ క్రికెట్ లీగ్‌లోని కొల్లం ఏరీస్ ఫ్రాంచైజీకి శ్రీశాంత్ సహ యజమానికిగా ఉన్నాడు. శ్రీశాంత్‌తోపాటు కొల్లం ఏరీస్, అలప్పుళ టీమ్ లీడ్ అలప్పుల రిప్పల్స్ ఫ్రాంచైజీలకు కూడా కేసీఏ నోటీసులు ఇచ్చింది. అయితే, ఫ్రాంచైజీల ఇచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా ఉండటంతో వాటి మీద ఏ విధమైన చర్యలు ఉండవని కేసీఏ తెలిపింది.






