కేరళకు మెస్సీ రావట్లేదు.. అర్జెంటీనా టీం విజిట్ క్యాన్సిల్: క్రీడామంత్రి

by Phanindra |

కేరళకు మెస్సీ రావట్లేదని, అర్జెంటీనా టీం విజిట్ క్యాన్సిల్ అయిందని కేరళ క్రీడామంత్రి వెల్లడించారు.

కేరళకు మెస్సీ రావట్లేదు.. అర్జెంటీనా టీం విజిట్ క్యాన్సిల్: క్రీడామంత్రి
X

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలోనే కేరళకు వస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అక్టోబరు నెలలో మెస్సీ సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం అంతా కేరళకు రావాల్సి ఉంది. అయితే ఈ ఆశలు అడియాసలయ్యాయని కేరళ క్రీడా మంత్రి వి. అబ్దురహమాన్ తెలిపారు. ఈ ఏడాదిలో కేరళకు అర్జెంటీనా టీం రావడం లేదని ఆయన స్పష్టంచేశారు. అక్టోబరులో ఈ టీం వచ్చేందుకు అవసరమైన మ్యాచ్ ఫీజును కూడా ఇదివరకే స్పాన్సర్లు చెల్లించారు.

కానీ షెడ్యూల్ సమస్యల కారణంగా అక్టోబరులో భారత్‌కు అర్జెంటీనా టీం రాలేదని ఆ టీం మేనేజ్‌మెంట్ చెప్తున్నట్లు సమచారం. అయితే భారత్‌కు చెందిన స్పాన్సర్లు మాత్రం అక్టోబరులోనే తమ కార్యక్రమం జరుగుతుందని, కాబట్టి ఆ సమయంలోనే మెస్సీ అండ్ టీం రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అర్జెంటీనా టీం విజిట్ క్యాన్సిల్ అయినట్లు అబ్దురహమాన్ వెల్లడించారు.

Next Story