T20WorldCup2026: టీమిండియా ఎదుట భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా

by Gantepaka Srikanth |

20 ప్రపంచకప్ భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు.

T20WorldCup2026: టీమిండియా ఎదుట భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు.. అనుకున్న విధంగా భారత జట్టు ఎదుట భారీ టార్గెట్ పెట్టారు. తొలుత వరుసగా మూడు వికెట్లు కోల్పోయినా ఎక్కడా నిరాశ చెందలేదు. డెవిడ్ మిల్లర్(63), బ్రేవిస్(45), స్టబ్స్(44) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 187 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బూమ్రా మూడు వికెట్లు, అర్షదీప్ సింగ్‌ రెండు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. భారత జట్టు విజయం సాధించాలంటే 188 పరుగులు చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సౌతాఫ్రికాపై టీమిండియాదే పైచేయి. మొత్తం 7 మ్యాచ్‌లలో ఇరు జట్లు తలపడితే భారత్ ఏకంగా 5 మ్యాచ్‌లలో విజయం సాధించింది. సౌతాఫ్రికా కేవలం రెండు మ్యాచ్‌లలోనే గెలిచింది. 2007, 2010, 2012, 2014, 2024లో భారత్ సౌతాఫ్రికాపై విజయం సాధించగా.. 2009, 2022లో ఓటమిపాలయింది.

భారత జట్టు..

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

సౌతాఫ్రికా జట్టు..

ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, డివాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, మార్కో యాన్సన్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి.

Next Story