భార‌త్ కు షాక్‌..రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా విక్ట‌రీ

by velandi.Saikiran |   (  Updated:2025-12-03 16:55:19  IST  )

భార‌త జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఫ‌స్ట్ మ్యాచ్ లో గెలిచిన భార‌త్ ను రెండో వ‌న్డేలో చిత్తు చేసి స‌ఫారీలు

భార‌త్ కు షాక్‌..రెండో వ‌న్డేలో సౌతాఫ్రికా విక్ట‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భార‌త జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఫ‌స్ట్ మ్యాచ్ లో గెలిచిన భార‌త్ ను రెండో వ‌న్డేలో చిత్తు చేసి స‌ఫారీలు గ్రాండ్ విక్ట‌రీ అందుకున్నారు. రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో భార‌త్ పై 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది సౌతాఫ్రికా. బ్యాట‌ర్లంద‌రూ స‌మిష్టిగా రాణించిన త‌రుణంలో 359 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా చేధించింది ద‌క్షిణాఫ్రికా. ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్, నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయి, 358 ప‌రుగులు సాధించింది. విరాట్ కోహ్లీ, రుత‌రాజ్ సెంచ‌రీ చేయ‌డంతో భారీ స్కోర్ సాధించింది భారత్.

అయితే, ఈ ల‌క్ష్యాన్ని 49.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 6 వికెట్లు న‌ష్ట‌పోయి స‌ఫారీ జ‌ట్టు చేధించింది. ఇక ఈ విజ‌యంతో 3 వ‌న్డేల సిరీస్ ను 1-1 తేడాతో స‌మం చేసింది సౌతాఫ్రికా. కాగా, ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య డిసెంబ‌ర్ 6వ తేదీన మూడో వ‌న్డే ఉండ‌నుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు సిరీస్ గెలుచుకోనుంది. ఇది ఇలా ఉండ‌గా ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్క్రామ్ సెంచరీ న‌మోదు చేశాడు. 98 బంతుల్లో 110 ప‌రుగులు సాధించాడు. బ‌వుమా 46 ప‌రుగులు, మాథ్యూ బ్రీట్జ్కే 68, బ్రేవీస్ 54 ప‌రుగులు సాధించారు. చివ‌ర‌లో కార్బిన్ బాష్ 29 ప‌రుగులు చేసి జ‌ట్టును గెలిపించాడు.

Next Story