South Africa vs India : భారత మహిళల జట్టు ఆశలు గల్లంతు.. మూడో టీ20లోనూ ఓటమి

by Harish |

South Africa vs India : భారత మహిళల జట్టు ఆశలు గల్లంతు.. మూడో టీ20లోనూ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు కోల్పోయింది. వరుసగా మూడో టీ20లోనూ ఓడి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను సమర్పించుకుంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ 9వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(66), షెఫాలీ వర్మ(64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. స్మృతి మంధాన(37) కూడా పర్వాలేదనిపించింది. అయితే, భారత జట్టు భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. 193 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా పెద్దగా కష్టపడుకుండానే ఛేదించింది. ఛేదనలో కెప్టెన్ వొల్వార్ట్(115) మెరుపు శతకంతో రెచ్చిపోయింది. సునె లూస్(64 నాటౌట్) సత్తాచాటింది. దీంతో సౌతాఫ్రికా 16.3 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి విజయం సాధించింది. శనివారం నాలుగో టీ20 జరగనుంది.

Next Story