- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో టెస్టుపై సౌతాఫ్రికా పట్టు.. 500 పరుగులకు పైగా లీడ్
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా పట్టు సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు పూర్తిగా పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట లంచ్ విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు భారత్ పై ఏకంగా 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. లంచ్ సెషన్‌కు ముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడి, స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 500 పరుగులకు పైగా లీడ్ అంటే ప్రత్యర్థి జట్టు ముందు గెలవడానికి - మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి దాదాపు అసాధ్యమైన సవాలుగా మారింది. ఈ భారీ ఆధిక్యం నేపథ్యంలో, దక్షిణాఫ్రికా జట్టు లంచ్ విరామం తర్వాత త్వరలోనే తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, మిగిలిన నాలుగు సెషన్లలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడానికి తమ బౌలర్లకు తగినంత సమయాన్ని కేటాయించాలని చూసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ సౌతాఫ్రికా డిక్లేర్ ప్రకటిస్తే.. భారత బ్యాటర్లు ఏ విధంగా రాణిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






