- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివిలియర్స్ విధ్వంసం.. 39 బంతుల్లోనే శతకం బాదిన మాజీ క్రికెటర్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. ఆదివారం ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే శతకం బాదాడు. ఏబీడీ మెరుపులతో సౌతాఫ్రికా చాంపియన్స్ 95 పరుగుల తేడాతో ఆసిస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 241 పరుగులు చేసింది. డివిలియర్స్ కేవలం 46 బంతుల్లోనే 123 రన్స్ చేశాడు. అతనికితోడు స్మట్స్(85) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా తేలిపోయింది. 16.4 ఓవర్లలోనే 146 పరుగులకే చేసి ఆలౌటైంది. బెన్ కటింగ్(59 నాటౌట్) ఒక్కటే రాణించగా..మిగతా వారు విఫలమయ్యారు. సౌతాఫ్రికా చాంపియన్స్ కెప్టెన్ ఆరోన్ ఫాంగిసో 4 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లు పడగొట్టి ఆసిస్ పతనాన్ని శాసించారు. టోర్నీలో మూడు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించాయి. మరో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లాండ్, భారత్ పోటీపడుతున్నాయి.






