- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌తో వన్డే, టీ20లు ఆడే సఫారీ టీం ఇదే..!
భారత్‌తో వన్డే, టీ20లు ఆడే సఫారీ టీం ప్రకటించారు. సౌతాఫ్రికా టీం 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది.

దిశ, స్పోర్ట్స్: భారత్‌తో టెస్టు సిరీస్ జరుగుతుండగానే.. వన్డే, టీ20 సిరీసులకు సౌతాఫ్రికా జట్టును ప్రకటించేసిందా దేశ క్రికెట్ బోర్డు. నవంబరు 30 నుంచి డిసెంబర్ 6 వరకు భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేలు, డిసెంబరు 9 నుంచి 16 వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. వన్డేలకు రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్టణం ఆతిథ్యమివ్వనుండగా.. టీ20 మ్యాచులు కటక్, న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే వన్డేలకు 15 మందితో, టీ20లకు 15 మందితో జట్లను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. వీటిలో వన్డే సిరీసులో సఫారీ జట్టుకు టెంబా బవుమానే సారధ్యం వహిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే టీ20లకు మాత్రం ఎయిడెన్ మార్క్రమ్ కెప్టె్న్సీ చేస్తాడని తెలిపింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న రబాడ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో అతని స్థానంలో ఆన్రిచ్ నోకియాను జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికా వన్డే జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఓట్నెల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీజ్‌కీ, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రె బర్గర్, క్వింటన్ డీకాక్, టోనీ డి జార్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎన్గిడీ, ర్యాన్ రికెల్టన్, ప్రెనేలన్ సుబ్రయేన్
టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఓట్నెల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీజ్‌కీ, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డీకాక్, టోనీ డి జార్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండె, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడీ, ఆన్రిచ్ నోకియా, ట్రిస్టన్ స్టబ్స్






