- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ లో మెస్సి పర్యటన.. రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేసిన గంగూలీ
గోట్ టూర్ ఆఫ్ ఇండియా పేరుతో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి..

దిశ, వెబ్‌డెస్క్: గోట్ టూర్ ఆఫ్ ఇండియా పేరుతో అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. భారత పర్యటనను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. కాగా.. ఈ టూర్ లో భాగంగా ఆయన కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు. కానీ అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో నిర్వాహకలు ఫెయిల్ కావడంతో మెస్సి అనుకున్న సమయం కంటే ముందుగానే మైదానం నుంచి వెళ్లిపోయాడు. దీంతో అభిమానులు ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. అయితే.. ఇందులో గంగూలీకి పాత్ర ఉందంటూ అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా ఆరోపించాడు. మెస్సి ఈవెంట్ నిర్వాహకుడైన శతద్రు దత్తాకు సౌరభ్ గంగూలీ మీడియేటర్ గా ఉన్నట్లు మీడియాతో అన్నాడు. దీనిపై గంగూలీ రియాక్ట్ అయ్యాడు. సాహా చేసిన వ్యాఖ్యలపై రూ.50 కోట్ల పరువునష్టం దావా వేశాడు.
ఉత్తమ్ సాహా ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం తన పరువుకు భంగం కలిగించాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోల్ కతాలో జరిగిన మెస్సి ఈవెంట్ కు తానొక అతిథిగా మాత్రమే వెళ్లానని, ఈ ఈవెంట్ తో తనకు అధికారికంగా ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు.






