- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త అవతారం ఎత్తబోతున్న గంగూలీ.. తొలిసారిగా ఆ బాధ్యతలు
భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. కోచ్‌గా కెరీర్‌ను ఆరంభించనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్‌కు గంగూలీ హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. గంగూలీ నియామకాన్ని ఫ్రాంచైజీ ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘రాజధానుల శిబిరానికి రాజభోగాలను తీసుకరావడానికి ప్రిన్స్ సిద్ధంగా ఉన్నాడు. సౌరవ్ గంగూలీని తమ కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటిస్తున్నాం. సెంచూరియన్ ఎదురుచూస్తుంది.’అని ఫ్రాంచైజీ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది.
ఇంతకుముందు గంగూలీ కోచ్‌గా వ్యవహరించలేదు. తొలిసారిగా ఓ జట్టుకు కోచింగ్ ఇవ్వబోతున్నాడు. 2018, 2019లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఓనర్ అయిన జేఎస్‌డబ్ల్యూకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియామకమయ్యాడు. అయితే, గత సీజన్‌లో ప్రిటోరియా జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న జోనాథన్ ట్రాట్ తప్పుకోవడంతో గంగూలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెలలో జరిగే ఎస్‌ఏ20 వేలంలో గంగూలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ యాక్షన్‌లో భారత్ నుంచి పీయూశ్ చావ్లా సహా 13 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.






