ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీకి భారీ షాక్

by Harish |   (  Updated:2025-02-15 14:04:29  IST  )

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌(ఆర్సీబీ) బౌలర్ శ్రేయాంక పాటిల్ దూరమైంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీకి భారీ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌(ఆర్సీబీ) బౌలర్ శ్రేయాంక పాటిల్ దూరమైంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె లీగ్ నాటికి పూర్తిగా కోలుకోలేకపోయింది. దీంతో సీజన్ మొత్తం నుంచి తప్పుకుంది. దీంతో శ్రేయాంక స్థానంలో ఆర్సీబీ భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణాను జట్టులోకి తీసుకుంది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో శ్రేయాంక కీలక పాత్ర పోషించింది. 8 గేముల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. మరోవైపు, స్నేహ్ రాణా గత రెండు సీజన్లలో గుజరాత్ జెయింట్స్‌కు ఆడింది. అయితే, గత వేలంలో ఆమెను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. కాగా, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు టోర్నీలో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.

Next Story