పాములతో స్టేడియానికే వచ్చేసిన అభిమాని.. ఫోటోలు వైరల్

by velandi.Saikiran |

శ్రీలంక ( Srilanka) వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్య

పాములతో స్టేడియానికే వచ్చేసిన అభిమాని.. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీలంక ( Srilanka) వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ పాములు ( Snakes) పట్టే వ్యక్తి... స్టేడియానికి వచ్చి రచ్చ చేశాడు. రెండు కోబ్రాలు, అలాగే ఓ కోతిని తీసుకువచ్చి.. అభిమానులందరికీ చుక్కలు చూపించాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య గాలే వేదికగా... టెస్ట్ మ్యాచ్ జరిగింది. జూన్ 17వ తేదీన ప్రారంభమైన ఈ టెస్ట్ ఇవ్వాళ సాయంత్రం వరకు నడిచింది. అయితే చివరికి.. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 495 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులు చేసింది. ఇక అటు శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 485 పరుగులు చేయగా... రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగులు చేయగా.. అప్పటికే ఐదు రోజులు పూర్తయ్యాయి. దీంతో మొదటి మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే.. పాములు పట్టే వ్యక్తి... స్టేడియానికి వచ్చాడు. రెండు పాములతో పాటు ఓ కోతిని కూడా తీసుకువచ్చాడు. స్టేడియంలో దాదాపు 15 నిమిషాల పాటు రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. అయితే అతన్ని ఆ తర్వాత స్టేడియం సిబ్బంది బయటకు పంపించినట్లు తెలుస్తోంది.

Instagramme link

Next Story