స్మృతి మంధాన సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-28 15:01:47  IST  )

ఇంగ్లండ్‌(England)తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో భారత(India) జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana) అదరగొట్టారు. సెంచరీతో రాణించారు.

స్మృతి మంధాన సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌(England)తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో భారత(India) జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన(Smriti Mandhana) అదరగొట్టారు. సెంచరీతో రాణించారు. ఇప్పటివరకు 53 బంతులు ఆడిన ఆమె.. 102 పరుగులు చేశారు. ఇందులో మూడు సిక్సులు, 14 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు టీమిండియాకు సైతం భారీ స్కోరు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నారు. ఇప్పటివరకు 17 ఓవర్లు పూర్తి కాగా, రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఇప్పటికే 184 పరుగులు చేసింది. సులువుగానే 200 పైచిలుకు టార్గెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు.. ఇటీవలే స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్‌ జాబితాలో స్మృతి 727 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంకు సాధించడం ఇదే ప్రథమం.

Next Story