- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన్డేల్లో స్మృతి మంధాన అరుదైన రికార్డు
వన్డేల్లో టీమిండియా(Team India) మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అరుదైన రికార్డు నెలకొల్పారు.

దిశ, వెబ్‌డెస్క్: వన్డేల్లో టీమిండియా(Team India) మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అరుదైన రికార్డు నెలకొల్పారు. మహిళల వన్డేల్లో(ODI Match) రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాపై 50 బంతుల్లో 101 చేశారు. అంతకుముందు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా ఇవాళ్టి మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న స్మృతి 125 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. అంతేకాకుండా వరుసగా రెండు వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన నిలిచారు. ముల్లాన్‌పుర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ మంధాన (117) శతకం చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఇదే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. బెత్ మూనీ (138; 75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకం బాదడంతో భారీ స్కోరు వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమానికి మద్దతుగా నిలిచేందుకు భారత మహిళా క్రికెటర్లు ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీ ధరించారు.






