Smriti Mandhana : మిథాలీ రాజ్ రికార్డు‌ను బ్రేక్ చేసిన మంధాన

by Sathputhe Rajesh |   (  Updated:2025-01-10 16:51:01  IST  )

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Smriti Mandhana : మిథాలీ రాజ్ రికార్డు‌ను బ్రేక్ చేసిన మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆమె 41 రన్స్ చేయడంతో వన్డే ఫార్మాట్‌లో 4 వేల పరుగుల మైలురాయిని సాధించింది. దీంతో వేగంగా వన్డేల్లో 4,000 రన్స్ చేసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఘనత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది. మిథాలీ 112 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల రన్స్ చేసింది. మంధాన 95 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించి మిథాలీ రికార్డును బ్రేక్ చేసింది. మహిళా క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్ మంధాన. మొత్తంగా వన్డేల్లో 4 వేల రన్స్ చేసిన 15వ ప్లేయర్. వన్డేల్లో వేగంగా 4,000 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా క్రికెటర్ బెలిండా క్లార్క్(86 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. వన్డేల్లో భారత్ తరఫున మిథాలీ రాజ్(7,805 రన్స్)తో టాప్ రన్‌స్కోరర్‌గా ఉండగా.. మంధాన(4,001 రన్స్‌) రెండో స్థానంలో ఉన్నది.

Next Story