Smriti Mandhana: ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-27 09:45:02  IST  )

భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనత సాధించారు.

Smriti Mandhana: ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మరో అరుదైన ఘనత సాధించారు. ఈ మేరకు ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ (ICC Women's ODI Cricketer of the Year) పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తాజాగా ఐసీసీ (ICC) అధికారికంగా వెల్లడించింది. 2024లో ఆడిన వన్డేల్లో మొత్తం 13 ఇన్నింగ్స్‌లలో స్మృతి మంధాన (Smriti Mandhana) 747 పరుగులు చేసి ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఇది వరకు లారా వోల్వార్డ్ట్ (Laura Wollward) (697), టామీ బ్యూమాంట్ (Tommy Beaumont) (554), హేలీ మాథ్యూస్ (Haley Matthews) (469) వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా నిలిచారు. స్మృతి మంధాన (Smriti Mandhana) 747 పరుగులను 57.86 సగటుతో, 95.15 స్ట్రైక్ రేట్‌తో సాధించింది. గతేడాది అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి ప్రథమ స్థానంలో నిలించింది.

Next Story