స్మృతి మంధాన మరో అరుదైన రికార్డు

by Gantepaka Srikanth |

టీమిండియా స్టార్ ఉమెన్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana) మరో అరుదైన రికార్డు సాధించింది.

స్మృతి మంధాన మరో అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఉమెన్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana) మరో అరుదైన రికార్డు సాధించింది. వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసింది. 5 వేల పరుగులు చేసిన రెండో మహిళా భారత బ్యాటర్‌ మంధాన రికార్డుల్లోకి ఎక్కింది. అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డ్ సాధించింది. 112 ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు చేసింది. మొత్తంగా ఆస్ట్రేలియాపై స్మృతి మంధాన 10 హాఫ్‌ సెంచరీలు చేసింది. కాగా, మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా విశాఖ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 48.5 ఓవర్లలో 330 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ స్మృతి మంధాన 80 పరుగులతో అదరగొట్టింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (75) కూడా మెరిసింది. ఓపెనింగ్ జోడీ దాదాపు సగం ఓవర్లు ఆడి తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కిదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

Next Story