- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా స్మృతి..5 ఏళ్ళ తర్వాత
టీమిండియా మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించారు. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించారు. తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో స్మృతి మంధాన అదరగొట్టారు. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో... తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో.. మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు స్మృతి మంధాన.
అటు అదే సమయంలో.. టి20 మ్యాచ్ లో కూడా ఆమె... టాప్ 5 లోకి దూసుకు వచ్చారు. ఐసీసీ టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో.. ఏకంగా నాలుగువ స్థానాన్ని సంపాదించుకున్నారు. వన్డే అదే సమయంలో టి20 లో కూడా ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకున్న స్మృతి మంధాన పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఐదేళ్ల కిందట అంటే 2019లో ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.






