తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డ్

by Gantepaka Srikanth |

టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అరుదైన ఘనత సాధించారు.

తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో చరిత్ర సృష్టించారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక మహిళా ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ వరల్డ్ కప్లో భాగంగా విశాఖ మైదానాంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఆమె ఈ ఘనత సాధించారు. కాగా ప్రస్తుత మ్యాచులో భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి (49 నాటౌట్), ప్రతీక (40 నాటౌట్) శుభారంభాన్నిచ్చారు. టీమ్ స్కోర్ 17 ఓవర్లకు 90/0గా ఉంది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్‌కు గత పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది. దాన్నుంచి బయటకొచ్చి ఆస్ట్రేలియాను ఓడించాలని అభిమానులు కోరుతున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఐసీసీ ఛైర్మన్ జై షా ప్రత్యేకంగా విచ్చేశారు.

Next Story