- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG గా మారిన సిరాజ్.. ఫోటో వైరల్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్ లో... మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో బుమ్రా రెచ్చిపోతాడు అనుకుంటే.. అతని స్థానానికి చెక్ పెట్టి దుమ్ము లేపాడు హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహమ్మద్ సిరాజ్.
ఈ టోర్నమెంట్ మొత్తంలో 185 ఓవర్లు వేసిన మహమ్మద్ సిరాజ్.... మొత్తం 23 వికెట్లు తీసి... మొదటి స్థానంలో నిలిచాడు. అంతే కాదు రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు మహమ్మద్ సిరాజ్. చివరి టెస్టులో కూడా తన ప్రదర్శనతో టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇండియా పరువు కాపాడాడు.
దీంతో మహమ్మద్ సిరాజ్ ను మెచ్చుకుంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హీరో లెవెల్ లో టీం ఇండియాను ఆదుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG పోస్టర్ తరహా లోనే మహమ్మద్ సిరాజ్ పోస్టర్ ను కూడా వైరల్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ చూసిన సిరాజ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. సిరాజ్ ఆన్ డ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






