- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్ జోడీ హవా.. వరల్డ్ నం.1 జంటకు షాకిచ్చి సెమీస్‌కు..
సింగపూర్ ఓపెన్‌లో భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు ఎదురులేకుండా పోయింది.

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్ ఓపెన్‌లో భారత పురుషుల డబుల్స్ స్టార్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు ఎదురులేకుండా పోయింది. ఈ జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ దిశగా కీలక విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఏకంగా వరల్డ్ నం.1 జంటనే చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-17, 21-15 తేడాతో మలేసియాకు చెందిన గోహ్ స్జీ ఫీ-నూర్ ఇజుద్దీన్ జంటపై విజయం సాధించింది. 39నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో భారత జంట అద్భుతమైన డిఫెన్సివ్ నైపుణ్యాలు ప్రదర్శించి మ్యాచ్‌ను కంట్రోల్ ఉంచుకుంది. అదే సమయంలో దూకుడుగా ఆడటంతో ఒత్తిడిలో ప్రత్యర్థులు తప్పులు చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఏడాది సాత్విక్, చిరాగ్‌లు సెమీస్‌కు చేరుకున్న మూడో టోర్నీ ఇది. సెమీస్‌లో మలేసియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయి ఇక్ జోడీతో భారత ద్వయం తలపడనుంది. వరల్డ్ నం.3 ర్యాంక్‌లో ఉన్న ప్రత్యర్థులతో సాత్విక్ జోడీకి సవాల్ తప్పదు.






