జాతి వివక్ష ఎదుర్కొన్న జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. కోచ్‌పై ఫిర్యాదు

by Harish |

జింబాబ్వే టీ20 కెప్టెన్ సికిందర్ రజా జాతి వివక్ష ఎదుర్కొన్నాడు.

జాతి వివక్ష ఎదుర్కొన్న జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా.. కోచ్‌పై ఫిర్యాదు
X

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే టీ20 కెప్టెన్ సికిందర్ రజా జాతి వివక్ష ఎదుర్కొన్నాడు. విగ్నే కప్‌లో భాగంగా ఈ నెల 1న ఓల్డ్ హరేరియన్స్, రెయిన్‌బో క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ టోర్నీలో ఓల్డ్ హరేరియన్స్‌కు రజా ఆడుతున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా రజాను ప్రత్యర్థి జట్టు హెడ్ కోచ్ బ్లెస్సింగ్ మఫువా అవమానకర వ్యాఖ్యలు చేసినట్టు అక్కడి మీడియా తెలిపింది. కోచ్‌పై రజా హరారే మెట్రోపాలిటన్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌ఎంసీఏ)లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన హెచ్‌ఎంసీఏ కోచ్ బ్లెస్సింగ్ మఫువాను సస్పెండ్ చేసింది. తాము జాత్యంహకార ఆరోపణలను తేలికగా తీసుకోమని, విచారణ చేపట్టినట్టు హెచ్‌ఎంసీ చైర్‌పర్సన్ తఫాద్జ్యా మాడోరో తెలిపారు. రజా మాట్లాడుతూ.. పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నట్టు ఆశించాడు. దోషిగా తేలితే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితం తేల్చగా రజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓల్డ్ హరేరియన్స్ 142 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో రజా 56 బంతుల్లో 78 రన్స్ చేసి సత్తాచాటాడు.


Next Story