కోహ్లీలో అదే నాకిష్టం.. సచిన్ వల్లనే క్రికెటర్‌గా మారా: శుభ్‌మన్ గిల్

by Phanindra |

సచిన్ వల్లనే తాను క్రికెటర్‌గా మారానని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. అలాగే కోహ్లీలో తనకు బాగా నచ్చే అంశం ఏంటో కూడా వివరించాడు.

కోహ్లీలో అదే నాకిష్టం.. సచిన్ వల్లనే క్రికెటర్‌గా మారా: శుభ్‌మన్ గిల్
X

దిశ, స్పోర్ట్స్: తనకు ఇద్దరు క్రికెట్ ఐడల్స్ ఉన్నారని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ఫ్యూచర్ స్టార్‌గా పేరొందిన ఈ యంగ్ క్రికెటర్.. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో తన జీవితానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అంటే తన తండ్రికి పిచ్చి అభిమానమని, సచిన్ వల్లనే తను క్రికెటర్ అయ్యానని గిల్ వెల్లడించాడు. తను క్రికెట్ మెళకువలు పూర్తిగా తెలుసుకుంటున్న సమయంలోనే సచిన్ రిటైర్ అయ్యాడని, అదే సమయంలో తను కోహ్లీని ఫాలో అవడం మొదలు పెట్టానన్నాడు. చెప్పాడు. విరాట్ ఆట చూడటం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

‘నాకు ఇద్దరు ఐడల్స్ ఉన్నారు. మొదటి వాడు సచిన్ టెండూల్కర్. మా నాన్నకు ఆయనంటే చాలా అభిమానం. సచిన్ వల్లనే నేను క్రికెట్ అయ్యాను. ఆయన 2013లో రిటైర్ అయ్యారు. నేనేమో 2011-2013 మధ్యనే క్రికెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నా. జస్ట్ నైపుణ్యాలే కాకుండా మానసికంగా, వ్యూహాత్మగంగా గేమ్ ఎలా చదవాలో అర్థం చేసుకున్నా. అప్పుడే నేను కోహ్లీని చాలా క్లోజ్‌గా ఫాలో అవ్వడం మొదలు పెట్టా. తన ఆటలో ఉండే ప్యాషన్, ఆకలి అంటే నాకు అభిమానం. టెక్నిక్‌లు, స్కిల్స్ నేర్చుకోవచ్చు కానీ.. ఆ ఆకలి ఎవరూ మనకు నేర్పించలేరు. అది మనలో ఉండాల్సిందే. విరాట్‌లో అంది టన్నుల కొద్దీ ఉంది. అందుకే తనను చూస్తే నాకు చాలా ఇన్స్‌పిరేషన్ కలుగుతుంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు.

Next Story