అద్భుతంగా పోరాడాం.. లార్డ్స్ ఓటమిపై గిల్ రియాక్షన్!

by Phanindra |

లార్డ్స్ ఓటమిపై గిల్ స్పందించాడు. ఓడినప్పటికీ తమ జట్టు అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు.

అద్భుతంగా పోరాడాం.. లార్డ్స్ ఓటమిపై గిల్ రియాక్షన్!
X

దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమిపై కెప్టెన్ గిల్ స్పందించాడు. ఓడినా సరే తమ టీం పోరాట పటిమ చూస్తే గర్వంగా ఉందన్నాడు. ‘ఐదు రోజుల ఆట తర్వాత కూడా చివరి సెషన్ వరకు మ్యాచ్ ఉత్కంఠగానే సాగింది. ఐదో రోజు మా వద్ద చాలా బ్యాటింగ్ ఉండటంతో ధీమాగా ఉన్నా. ఒకటి, రెండు 50 పరుగుల భాగస్వామ్యాలు వచ్చుంటే గెలిచేవాళ్లం. కానీ అది జరగలేదు’ అని చెప్పాడు.

అదే సమయలో తొలి ఇన్నింగ్సులో పంత్ అవుటవడమే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని గిల్ అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్సులో క్రీజులు కుదురుకున్న తర్వాత అనవసర పరుగు కోసం ప్రయత్నించిన పంత్‌ను బెన్ స్టోక్స్ రనౌట్ చేశాడు. ఇదే గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అన్న గిల్.. దీంతో తొలి ఇన్నింగ్సులో భారత్ లీడ్ సాధించలేకపోయిందన్నాడు.

‘ఐదు రోజుల ఆటను ఐదు నిమిషాల్లో జరిగిన ఘటనతో వివరించలేం. చివరి రోజు ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమని మాకు తెలుసు. నన్నడిగితే ఫస్ట్ ఇన్నింగ్సులో పంత్ అవుటవడమే గేమ్ ఛేంజింగ్ మూమెంట్. తను అవుటవ్వకపోతే కనీసం 50-100 రన్స్ లీడ్ సాధించే వాళ్లం. అదే జరిగి ఉంటే ప్రత్యర్థి టీం వెనుకంజలో ఉండేది’ అని చెప్పాడు టీమిండియా కెప్టెన్. అలాగే ఒత్తిడిని డీల్ చేయడంలో కూడా జట్టు విఫలమైందని గిల్ అంగీకరించాడు.

Next Story